లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్లో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి తీవ్రంగా కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని జియోలాకల్ సర్వేలో పేర్కొనింది. దేశ రాజధాని సాన్ సాల్విడార్కు సమీపంలోని సముద్ర తీర పట్టణమైన లా లిబర్టెడ్లో కూడా భూమి కంపించిందని అధికారులు చెప్పారు.
Read Also: IND vs WI: కేవలం 12 మ్యాచ్‌లే.. సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!
అయితే భూకంపం సంభవించడం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్ల లేదని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోలాజికల్ సర్వేలో వెల్లడించారు. కాగా, పసిఫిక్ తీరంలో భూకంపం ప్రభావంతో నికరాగువా, హోండురస్, గ్వాటెమాలా, బ్రెజిల్లో కూడా స్వల్పంగా కదలికలు సంభవించాయని అధికారులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీచేయలేదన్నారు.
Read Also: Astrology: జూలై 19, బుధవారం దినఫలాలు
గత ఆదివారం అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. అలస్కా పరిధిలోని పెనిన్సులా ఏరియాలో దీని ప్రభావం కనిపించింది. దీంతో జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూకంప కేంద్రం 9.3 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. భూకంపం సంభవించినప్పుడు ప్రజలందరు తమ ఇళ్లను వదిలి పెట్టి బయటకు పరుగులు తీశారు. దీంతో అక్కడ పాక్షికంగా ఇళ్లు, రోడ్లు దెబ్బతీన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.