లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి తీవ్రంగా కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేల్ పై 6.5గా నమోదయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని జియోలాకల్ సర్వేలో పేర్కొనింది.
Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.