Most Expensive Vegetable: ఇప్పటి వరకు మన దృష్టిలో రేటు గల కూరగాయలంటే బ్రకోలీ, ఎరుపు, పసుపు క్యాప్సికమ్ మాత్రమే. కానీ అన్నింటికన్నా ఖరీదైన కూరగాయ ‘హాప్ షూట్స్’. ధర తెలిస్తే షాక్ తింటారు. కిలో లక్ష రూపాయలు మరీ. కేవలం ధనవంతుల ఆహారంగా మారింది ఈ కూరగాయ. మనదేశంలో దీన్ని సాగు చేయడం లేదు, కానీ ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో నాటినట్లు వార్తలు వచ్చాయి. అలాగే బీహార్‌కు చెదిన అర్నేష్ సింగ్ అనే రైతు కూడా వీటిని పండించినట్టు తెలుస్తోంది. కానీ వాటిని పండించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుండడంతో పండించడం ఆపేశారు. అందుకే మన దేశంలో ఈ కూరగాయ దొరకదు.
Read Also: IT Raids on Malla Reddy Assets: రెండో రోజు పూర్తైన మంత్రి మల్లారెడ్డిపై ఐటీ విచారణ
హాప్ షూట్ శాస్త్రీయ నామం హ్యూములస్ లుపులస్. ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు. ఈ పంట చేతికి రావాలంటే మూడేళ్లు పడుతుంది. హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు E, B6, Cలతో నిండి ఉంటుంది. అపారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం. అందుకే ఈ కూరగాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరగాయలో క్షయవ్యాధిని నియంత్రించే ప్రతిరక్షకాలు ఉంటాయి. నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి. హాప్ షూట్లు తినడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.