Maganti Gopinath : ప్రజాపాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెక్కులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే అందించాలని హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కావాలనే అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకొని ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. అవగాహన లేక ఎమ్మార్వో కార్యాలయాల్లో చెక్కుల పంపిణీ చేయాలని సూచించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకు పాలకుల సేవలు ఉండేవన్నారు. ప్రజా పాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలని, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల కై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..
ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లడం అనేది వ్యయప్రయసాలకు గురి కావడమే అని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెక్కులు అనేది ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయడం సులువు అవుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ 24 గంటలు అందించామని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ మంజూరు కావడం ఆనంద దాయకమని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరువలేదన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
- Bangladesh: షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్ వస్తాడంట.. బంగ్లాదేశ్ ప్రధాని షరతు..
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
తాజావార్తలు
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?