Madhavan Asks Apologises: “తప్పైతే క్షమించండి”.. సిక్కుల మనోభావాలపై క్లారిటీ ఇచ్చిన మాధవన్..!
- 'ధురంధర్ 2' సినిమాలో వచ్చిన సీన్‌పై వివాదం
- సిక్కుల పవిత్ర గ్రంథం శ్లోకాలు చెబుతూ మాధవన్ సిగరెట్ తాగాడని ఆరోపణలు
- ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు నమోదు
- మాధవన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా క్లారిటీ
- శ్లోకాలు చెప్పే సమయంలో తాను సిగరెట్ తాగలేదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavan Asks Apologises: ప్రముఖ నటుడు మాధవన్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) వివాదంలో చిక్కుకుంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘దశమ్ గ్రంధం’ లోని శ్లోకాలను చెబుతున్నపుడు మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శివసేన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
Also Read
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమాలో మాధవన్ ‘అజయ్ సన్యాల్’ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాత్రను పోషించారు. ఒక సీన్ లో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్ర శ్లోకాలను చెబుతూ మాధవన్ ధూమపానం చేశారని.. ఇది సిక్కు సమాజపు మనోభావాలను, గురువాని గౌరవాన్ని దెబ్బతీసిందని ముంబైకి చెందిన సిక్కు నాయకుడు గుర్జీత్ సింగ్ ఖేర్ ములుండ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలపై మాధవన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన “మా ధురంధర్ టీమ్ తరపున మీ ప్రేమకు ధన్యవాదాలు. అయితే, దశమ్ గ్రంథ్ లైన్లు చెబుతూ నేను సిగరెట్ తాగినట్లు వచ్చిన వార్తలు విని బాధపడ్డాను. కానీ, అది నిజం కాదు. సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పవిత్రమైన లైన్లు చెప్పడానికి చాలా ముందే సిగరెట్ ఆర్పేయాలని ఆయన నాకు చెప్పారు. ఆ సీన్ లో నా నోటి నుండి పొగ రాదు, నా చేతిలో సిగరెట్ ఉండదు, ఫ్రేమ్‌లో ఎక్కడా ధూమపానం కనిపించదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
తాము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోము. వ్యక్తిగతంగా నేను నా ప్రతి సినిమా విడుదలకు ముందు గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తాను. మాకు సిక్కు సమాజం అంటే ఎంతో గౌరవం ఉందని వివరణ ఇచ్చారు. సీన్ ప్రారంభంలో పాత్ర స్వభావం రీత్యా సిగరెట్ పట్టుకుని ఉండవచ్చని, కానీ పవిత్ర శ్లోకాలు పఠించే సమయంలో వాటిని పూర్తిగా దూరం పెట్టామని వివరించారు. అయినా కానీ మీకు తప్పు అనిపిస్తే క్షమించండి అంటూ మాధవన్ హుందాగా మాట్లాడారు.
తాజావార్తలు
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!