NTV Telugu Site icon

Madhavi Latha : రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా..

Madhavi Latha

Madhavi Latha

హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల మంది రౌడి మూకలు దాడికి యత్నించారని, రిగ్గింగ్ జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు స్పందించలేదని మాధవీ లత మండిపడ్డారు. ఇది భారత దేశమేనా.. ఇక్కడ 144 సేక్షన్ ఉండదా..? అని ఆమె ప్రశ్నించారు. ఈ రిగ్గింగ్ పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే రీ పోలింగ్ పెట్టడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని ఆమె వెల్లడించారు. రేపు ముంబైలో ప్రచారానికి వెళ్ళాలని పార్టీ ఆదేశించిందని అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు.

 PM Modi: భారత్‌కి ప్రధాని మోడీ నాయకత్వం అవసరం.. వక్ఫ్ బోర్డు చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

ఇదిలాఉంటే.. పోలింగ్ రోజు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలింగ్ బూత్‌ల్లో పర్యటించిన మాధవీలత.. రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో ఓ ముస్లిం మహిళను బుర్ఖా తీసి ఆమె ముఖాన్ని ఓటర్ స్లిప్‌లో ఉన్న ఫొటోతో సరిపోల్చి చూశారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో కన్నెర్రజేసిన ఈసీ.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలకు ఆమెపై మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌లో రిగ్గింగ్ జరిగిందని.. రీ పోలింగ్ నిర్వహించాలని మాధవీలత డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె డిమాండ్‌పై ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 Supreme Court: “గర్భంలో పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది”.. అవివాహిత పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..