Madhavi Latha : రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల మంది రౌడి మూకలు దాడికి యత్నించారని, రిగ్గింగ్ జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు స్పందించలేదని మాధవీ లత మండిపడ్డారు. ఇది భారత దేశమేనా.. ఇక్కడ 144 సేక్షన్ ఉండదా..? అని ఆమె ప్రశ్నించారు. ఈ రిగ్గింగ్ పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే రీ పోలింగ్ పెట్టడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని ఆమె వెల్లడించారు. రేపు ముంబైలో ప్రచారానికి వెళ్ళాలని పార్టీ ఆదేశించిందని అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు.
PM Modi: భారత్‌కి ప్రధాని మోడీ నాయకత్వం అవసరం.. వక్ఫ్ బోర్డు చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ఇదిలాఉంటే.. పోలింగ్ రోజు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ పోలింగ్ బూత్‌ల్లో పర్యటించిన మాధవీలత.. రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో ఓ ముస్లిం మహిళను బుర్ఖా తీసి ఆమె ముఖాన్ని ఓటర్ స్లిప్‌లో ఉన్న ఫొటోతో సరిపోల్చి చూశారు. ఈ ఘటన వివాదస్పదంగా మారడంతో కన్నెర్రజేసిన ఈసీ.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలకు ఆమెపై మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. హైదరాబాద్‌లో రిగ్గింగ్ జరిగిందని.. రీ పోలింగ్ నిర్వహించాలని మాధవీలత డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె డిమాండ్‌పై ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!