MAD : ఓటీటీ లోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమా గా విడుదలయి అద్భుత విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్ మూవీ ఒకటి. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్ గా వచ్చాయి. మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ బావ మరిది అయిన నార్నే నితిన్ మ్యాడ్ మూవీ తోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతనితో పాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు. తన కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. వీరితో పాటు మూడో హీరోగా రామ్ నితిన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన మ్యాడ్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్ మొదటి వారంలో మ్యాడ్ సినిమా ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.
మ్యాడ్ మూవీ కు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆటోని మరియు శ్రీకాంత్ రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్ ఈ మూవీలో ఓ క్యామియో రోల్లో మెరవడం గమనార్హం… సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య మరియు హారిక సూర్యదేవర సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మించారు. భీమ్స్ సిసిరిలియో అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూవీ కథ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం ఇంజినీరింగ్ కాలేజీ చుట్టే తిరుగుతోంది. మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. వారి జీవితాల్లోకి జెన్నీ(అనంతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి),మరియు , రాధ (గోపిక ఉద్యాన్) వస్తారు. మరి ఈ ముగ్గురి వల్ల అశోక్, మనోజ్, డీడీ జీవితాలు ఎలా మారిపోయాయి.. అన్నది ఎంతో ఫన్నీ గా తెరకెక్కించారు డైరెక్టర్. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేసారు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
- Tags
- Mad
- OTT
- Streaming
- super hit movie
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!