Site icon NTV Telugu

Gulzar House: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్‌ కనెక్షన్..!

Gulzar House

Gulzar House

Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ లైన్‌ను ఉపయోగిస్తూ బాధిత కుటుంబం ఇంటి కరెంట్‌ మీటర్‌పై ఎక్కువ లోడ్ పడినట్లు తెలుస్తోంది. ఆలోచించదగ్గ విషయమేమంటే, అదే లోడ్ కారణంగా మీటర్‌బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు.. ఆ మంటలు మొదట మీటర్ బాక్స్‌లో వచ్చి, ఆ బాక్స్‌ పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌ను అంటుకున్నాయి.

Indian Army: ఆర్మీలో చేరడం మీ కలా? టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కు వెంటనే అప్లై చేసుకోండి.. ఇంటర్ పాసైతే చాలు!

అక్కడ నుంచి మంటలు మరింతగా వ్యాపించి ఏసీ కంప్రెసర్‌ వరకు తాకాయి. అప్పటికే భవనం పై అంతస్తుల్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు ఏమీ గ్రహించకుండానే మంటలు ఇంటి అంతటా విస్తరించాయి. ఈ ప్రమాదానికి కారణమైన అక్రమ కరెంట్ కనెక్షన్లపై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. హైటెన్షన్ లైన్ల నుంచి వ్యక్తిగతంగా కరెంట్ తీసుకోవడాన్ని గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా మరిన్ని ఇలాంటి అక్రమ కనెక్షన్లున్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో చిన్నచిన్న నిబంధనల ఉల్లంఘన ఎంతటి ప్రాణ నష్టం కలిగించగలదో మరోసారి తేలిపోయింది. అక్రమ కరెంట్ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా తీవ్రమైంది.

Techie Suicide: పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. స్పందించిన ఓలా!

Exit mobile version