NTV Telugu Site icon

Lucky Baskar : రెండో రోజు కూడా సాలీడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘లక్కీ భాస్కర్’

New Project 2024 11 02t095909.291

New Project 2024 11 02t095909.291

Lucky Baskar : ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా.. ఫస్ట్ షోతోనే పక్క పైసా వసూల్ సినిమా అనే టాక్ అందుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన లక్కీ భాస్కర్.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ, కథనం, దుల్కర్‌ యాక్టింగ్‌ అదిరిపొయింని అంటున్నారు. సీతారామం తర్వాత.. ఈ సినిమాతో దుల్కర్‌కి తెలుగులో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టే. ఇక సూపర్ రివ్యూస్ అందుకొని సాలిడ్ మౌత్ టాక్ రావడంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబాట్టాడు లక్కీ భాస్కర్.

Read Also:Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం.. శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..

తొలిరోజు కలెక్షన్స్‌ వివరాలు తెలియజేస్తూ.. చిత్ర నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసిందని తెలిపింది. అలాగే రెండో రోజుకు 26.2కోట్లకు కలెక్షన్లు చేరుకున్నాయి. యునానిమస్ బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది లక్కీ భాస్కర్. ఇక 1980-90ల్లో బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. భాస్కర్‌ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్‌ చేశాడనే కథతో దీనిని రూపొందించారు. భాస్కర్‌ సతీమణి సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి ఆకట్టుకుందని అంటున్నారు. ఇప్పటి వరకు మీనాక్షికి సరైన పాత్ర పడలేదు. కానీ లక్కీ భాస్కర్‌లో మాత్రం సూపర్ రోల్ చేసిందని అంటున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read Also:West Bengal: బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

Show comments