లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్‌క్రమ్ (58), నికోలస్ పూరన్ (61) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మిచెల్ మార్ష్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రిషభ్ పంత్ (21) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆయుష్ బదోని 28 పరుగులు సాధించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.
READ MORE: Prabhas : స్పిరిట్ కోసం బరువు తగ్గబోతున్న ప్రభాస్..?
విశేషం ఏంటంటే.. లక్నో ఖాతాలో ఇది హ్యాట్రిక్ విజయం. మరోవైపు.. గుజరాత్ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమి పాలైంది. టాస్ ఓడి బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 180 పరుగులు సాధించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (60), సాయి సుదర్శన్ (55) అర్ధ సెంచరీతో అదరగొట్టారు. మిగతా వాళ్లెవరూ అంతగా రాణించలేకపోయారు. రూథర్‌ఫోర్డ్ (22) , జోస్ బట్లర్ (16), వాషింగ్టన్ సుందర్ (2) పరుగులు మాత్రమే చేశారు. చివరికి షారుక్ ఖాన్ (11), రషీద్ ఖాన్ (4) నాటౌట్‌గా నిలిచారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, శార్దూల్ ఠాకూర్ 2, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
READ MORE: KTR : కాంగ్రెస్‌పై మండిపడ్డ కేటీఆర్.. రజతోత్సవ సభకు అనుమతివ్వలేదని ఆరోపణ