Lucifer 2: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యామియోలో కనిపించాడు. ఇక ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే పేరుతో రేక్ చేశాడు. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ మెరవగా.. నయనతార, చిరుకు చెల్లెలిగా కనిపించింది. హీరో సత్యదేవ్.. విలన్ గా మెప్పించాడు. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది.
Chiranjeevi: ఆయన ఒక మెంటోర్.. ఒక గైడింగ్ ఫోర్స్.. ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్..
ఇక ఇప్పుడు లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఎప్పటినుంచో సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు వచ్చినా నేడు పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసి మేకర్స్ అధికారికంగా లూసిఫర్ 2 ను ప్రకటించారు. లూసిఫర్ 2 ఎంపురాన్ ఆమె పేరుతో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. లూసిఫర్ చివర్లో.. మోహన్ లాల్.. విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా ఉండడం చూపించారు. తన తమ్ముడైన టోవినో థామస్ ను సీఎం గా చేసి.. వెళ్లిన లూసిఫర్ అస్సలు ఎవరు..తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన ఒక యువకుడు.. లూసిఫర్ గా ఎలా మారాడు అనేది ఈ సీక్వెల్ లో చూపించనున్నారు. మరి ఈ సినిమా సీక్వెల్ వస్తే.. తెలుగులో గాడ్ ఫాదర్ 2 కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనేది చూడాలి.