LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండూ ఒకే ఒక్క విజయం సాధించాయి. ఈరోజు రెండు జట్లు ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను చూసినట్లైతే.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా అందులో ఎల్‌ఎస్‌జీ ఐదుసార్లు గెలిచింది. ముంబై జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇకపోతే, ఈరోజు మ్యాచ్ ఎకానా స్టేడియంలో జరుగుతుంది. ఈ మైదానంలో వారి మధ్య 2 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు సార్లు విజయం సాధించింది.
Read Also: Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్
ఇక ఎకానా స్టేడియం పిచ్ ఎర్రమట్టితో తయారు చేయబడింది. దీనిపై సాధారణంగా బ్యాటింగ్ సులభంగా మారుతుంది. బంతి పాతబడే కొద్దీ, స్పిన్నర్లకు కొంత సహాయం అందడం ప్రారంభమవుతుంది. దీని వలన బ్యాటింగ్ మరింత కష్టమవుతుంది. బౌలింగ్ లైనప్‌ను పరిశీలిస్తే ముంబై జట్టు స్వల్ప తేడాతో మెరుగ్గా కనిపిస్తోంది. ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే ముంబై గత మ్యాచ్‌లో KKRను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు, లక్నో తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరెవరు ప్లేయింగ్ XI లో ఉండనున్నారో ఈ విధంగా అంచనా వేయవచ్చు.
MI ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్.
LSG ప్రాబబుల్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.