Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది. ఇది రాబోయే 2 రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, ఈశాన్య దిశగా కదులుతూ శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అంటున్నారు. తుఫాన్ ఏర్పడితే రెమాల్‌గా నామకరణం చేసే అవకాశం ఉంది. తుఫాన్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మత్యకారులు, నావికులకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించింది.
Read Also: Ibrahim Raisi : ఆ 1.30 సెకన్లలోనే రైసీ మృతి మిస్టరీ దాగి ఉంది.. అనుమానం నిజమేనా?
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని.. ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా్ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెబుతున్నారు. ఈ నెల 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఏపీలోకి జూన్ మొదటివారంలో విస్తరిస్తాయని అంటున్నారు.
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!