Thalapathy Vijay: చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన డైరక్టర్స్ కి బడా హీరోలనుంచి ఆఫర్స్ రావటం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. కోలీవుడ్ లోనూ అలా తమ మొదటి సినిమాలతో మినిమం సక్సెస్ అందుకుని ఆ తర్వాత బంపర్ ఆఫర్స్ పట్టేసి అగ్ర దర్శకులుగా మారిన దర్శకుల జాబితాలో లోకేష్ కనకరాజు, అట్లీ, హెచ్ వినోద్, పా.రంజిత్ వంటి వారున్నారు. తాజాగా ఆ జాబితాలో ‘లవ్ టుడే’ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా చేరబోతోంది. కోలీవుడ్ టాప్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రదీప్ కి దర్శకుడుగా అవకాశం ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాను ప్రదీప్ తో ‘లవ్ టుడే’ తీసిన ఎజిఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుందట.ఈ మేరకు ప్రదీప్ కి అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.
Read Also:బీచ్ ఒడ్డున బోండంతో.. జాన్వీ అందాల విందు
ప్రదీప్ తొలి చిత్రం ‘కోమాలి’ని జయం రవితో రూపొంచాడు. ఆ సినిమా సక్సెస్ అయినా అతగాడిని అంత తొందరగా ఆఫర్స్ పలకరించలేదు. దాంతో తనే హీరోగా ‘లవ్ టుడే’ సినిమా తీశాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తెలుగులోనూ డబ్ అయి ఇక్కడా ఘన విజయం అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు 13 కోట్లను వసూలు చేసినట్లు వినికిడి. ఇప్పుడు హీరో విజయ్ ప్రదీప్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. తను చెప్పిన లైన్ కూడా నచ్చిందని పూర్తి స్థాయిలో రెడీ చేయమని చెప్పాడట. ప్రదీప్ ఆ పనిమీదే బిజీగా ఉన్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ప్రదీప్ కూడా తమిళ నాట అగ్రస్థాయి దర్శకుడుగా ఎదుగుతాడేమో చూడాలి.