ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ‘దండోరా’ సినిమా చూడాల్సిందే.
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమర్ టచ్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను మేకర్స్ మన ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలిసింది. ఇలా ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరించిన ‘దండోరా’ నుంచి లేటెస్ట్‌గా ‘పిల్లా…’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ రిలీజ్ చేస్తోంది. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా ఓవర్‌సీస్ రిలీజ్ అవుతోంది.