Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో నవదీప్ యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయింది.
Pawan Kalyan: ఎన్నికల తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా జూన్ 27 నుంచి ఆహలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా ఆహా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రచురించింది.
Pawan Kalyan Veeramallu : “వీరమల్లు” షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ ఎప్పుటినుంచంటే..
ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటించగా.. పంఖురి గిద్వాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతాన్ని అందించాడు. థియేటర్లలో అంతగా మెప్పించకపోయిన లవ్ మౌళి ఓటీటీలో ఏమాత్రం మెప్పించగలదో చూడాలి మరి.