రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. లారీ క్యాబిన్లో లారీ డ్రైవర్ ఇరుక్కుపోయాడు. జెసిబి సహాయంతో లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీశారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.