కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖైదీ, విక్రమ్, వంటి సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ తో లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరో గా లియో మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మొదట్లో నెగటివ్ టాక్ వచ్చిన కానీ కలెక్షన్స్ అద్భుతం గా వచ్చాయి. ఇదిలా ఉంటే లోకేష్ ‘జి స్క్వాడ్’ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థ ను ప్రారంభించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఫైట్ క్లబ్ . ఊరియాడి ఫేం విజయ్ కుమార్ హీరో గా నటిస్తుండగా.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే రీసెంట్‌గా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ జరుగగా.. ముఖ్య అతిథి గా లోకేష్ వచ్చి సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో లోకోష్ మాట్లాడుతూ.. రిలీజ్ డేట్ ఒత్తిడి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘లియో’ సెకండ్ ఆఫ్ బాగా లేదని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ను నేను తీసుకుంటున్నా. ఇక పై ఏదైనా సినిమా ను ప్రకటిస్తే.. సినిమా ప్రారంభం కాగానే రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయను. ఎందుకంటే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఒత్తిడి వలన అనుకున్న సన్నివేశాలను సరిగ్గా తీయలేము. అందుకే ఇక పై అలా చేయబోను అంటూ లోకేశ్ తెలిపారు.ఇదిలా ఉంటే లోకేష్ ప్రస్తుతం తలైవా రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ 171 వ సినిమా గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల తో లోకేష్ ఎంతో బిజీ గా వున్నారు.