దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఫస్ట్ ఫేజ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించాయి.
ఇది కూడా చదవండి: Sukumar: డైరెక్టర్‌గా సుకుమార్ కొత్త శిష్యుడు.. హిట్టు హీరోనే పట్టాడుగా!
తొలిదశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోంల్లో పోలింగ్ జరగనుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల్లో సైతం ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉంటే.. వాటిలో 8 స్థానాలు.. షహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజనూర్, నగినా, మొరాదాబాద్, రామ్‌పూర్, పిల్‌బిత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
అలాగే పశ్చిమబెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉన్నాయి. వాటిలో తొలి దశలో.. కుచ్ బిహార్, జల్పాయిగురి, అలీపుర్‌దౌర్స్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాల్లోని 5 స్థానాలు.. రామ్‌టెక్, నాగ్‌పూర్, బందారా గోండియా, గడ్చిరౌలి, చిముర్, చంద్రాపూర్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయాలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్‌లో 1, సిక్కిం, త్రిపురలలో ఒక్కో లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌లో కూడా 5 లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్, జమ్ము, కశ్మీర్‌లో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 తేదీతో మొదలై.. ఏడో దశ పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ ముగియనుంది.