Prakash Raj: మార్పుకోసం.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను : ప్రకాష్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసి దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తున్నారు. సౌత్, బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రకంపనలు సృష్టించిన నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం తన రాజకీయ ప్రకటనల కారణంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తుంటాడు. ప్రకాష్ రాజ్ కూడా శుక్రవారం ఓటు వేశారు. ఈ సందర్భంగా సౌత్ సూపర్‌స్టార్ ఏమన్నారో తెలుసుకుందాం.
Read Also:Odela 2 : ‘ఓదెల 2’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం..గూస్ బంప్స్ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో..
Also Read
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ, ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ- ‘హలో ఫ్రెండ్స్, నేను నా ఓటు వేసాను. మార్పు కోసం ఓటేశాను. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. సభలో మన గళం విస్తరిస్తుందని నేను విశ్వసించే ప్రాతినిధ్యానికి ఓటు వేసాను. మీరందరూ కూడా వెళ్లి ఓటు వేయండి. తద్వారా మార్పు రావచ్చు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.
Read Also:Election: ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు.. బయటకు వెళ్లి ఓటు వేయండి : ఎంపీ సుధామూర్తి
ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్‌పై పలు రకాల రియాక్షన్లు వస్తున్నాయి. ఓ నెటిజన్ ఖచ్చితంగా మార్పు తెద్దామంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు సార్, మీలాంటి నటులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పగలరు? అంటూ కామెంట్స్ చేశారు. పరిశ్రమలో అత్యంత పాపులర్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఏడాదిలో ఎన్నో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం పుష్ప 2, దేవర, రాయన్, భగీరా, OG వంటి చిత్రాలలో కనిపించనున్నారు. అతను 2024 సంవత్సరం ప్రారంభంలో గుంటూరు కారం వంటి చిత్రంలో కనిపించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!