Odela 2 : ‘ఓదెల 2’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం..గూస్ బంప్స్ తెప్పిస్తున్న వర్కింగ్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓదెల 2”.. బ్లాక్ బస్టర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా “ఓదెల 2” మూవీ తెరకెక్కుతుంది.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది..ఇప్పుడు వస్తున్న ఓదెల 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాలీడ్ రోల్ లో నటిస్తుంది.అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్ లుక్ మేకర్స్ షేర్ చేసారు..తమన్నా”శివ శక్తి “లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఓదెల 2లో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా అలాగే ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికరమయిన అప్డేట్ ఇచ్చారు. ఓదెల 2 మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయినట్లుగా మేకర్స్ వర్కింగ్ వీడియోను విడుదల చేసారు..ఈ వర్కింగ్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.ఓదెల 2 సినిమాను డైరెక్టర్ సంపత్ నంది గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా మరియు హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ మరియు మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు.ఓదెల 2 మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి . ఓదెల 2 షూటింగ్ మార్చిలో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో ప్రారంభమైంది.మొదటి విడత చిత్రీకరణ పూర్తవడంతో, రెండవ షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగనుంది .20-25 రోజుల పాటు ఈ షెడ్యూల్ చేయబడింది, ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!