Site icon NTV Telugu

Kamareddy District: లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

Suicide

Suicide

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టగా వరుస నష్టాలు రావడం వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పుల భారం, ఏజెంట్ల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక చివరికి తన ప్రాణాలు వదిలాడు. ఐదు నెలల క్రితమే సందీప్ వివాహం అయ్యిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనను జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

READ MORE: Family Missing: ఆరుగురు అదృశ్యం.. బాధిత కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?

కాగా.. ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం… ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే 10 నిమిషాల్లో కూడా రుణాలు ఇచ్చే సంస్థలు, యాప్ లు ఉన్నాయి. సకాలంలో రుణాలు చెల్లించకపోతే లోన్ యాప్​ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ యాప్​ల కారణంగా వందలాది మంది బాధితులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. తాజాగా ఈ యాప్​ల వేధింపులు విపరీత పోకడలకు వెళ్లాయి. బాధితుల మిత్రుల ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చడం కలకలం రేపుతోంది.

READ MORE: PM Modi: శ్రీలంకలో మోడీకి ఘనస్వాగతం.. 3 రోజులు పర్యటన

Exit mobile version