చాలా మందికి తమ ఇళ్లల్లో కుక్కలను, పిల్లులను కాకుండా భయంకరమైన సింహాలను, పులులను పెంచుకోవాలనే కోరిక ఉంటుంది. కొన్ని దేశాల్లో డబ్బున్న వారు తమ ఇంటిలో సింహాలను, చిరుతలను పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇంట్లో పెంచుకుంటున్న సింహాన్ని ఎవరైనా బయటకు షికారుకు తీసుకువచ్చారా అనుకోవడం పక్కా.
కనిపిస్తున్న వీడియోలో సింహం బైక్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. వెనుక నుండి చూస్తున్నప్పుడు సింహం లాంటి రంగు, తల నుంచి మెడ వరకు ఉన్న భారీ జుట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే కెమెరాను వెనక నుంచి ముందుకు తీసుకువెళుతున్నప్పుడు కానీ మనకు అసలు విషయం అర్థం కాదు.
Also Read: Viral News: మల్లీశ్వరి సినిమా రిపీట్…ప్రియుడి కోసం కోట్ల ఆస్తి వదిలేసిన ప్రేయసి!
కెమెరాను ముందుకు తీసుకువెళ్లినప్పుడు అక్కడ కళ్లజోడు పెట్టుకొని ఒక కుక్క కూర్చోవడాన్ని మనం గమనించవచ్చు. కుక్కకు సింహంలాంటి డ్రెస్ వేసి, కళ్లజోడు పెట్టి బయటకు తీసుకువచ్చారు. కుక్కను వెనుక నుంచి చూసి మొదట జనం భయపడుతున్నారు. తరువాత అది కుక్క అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు కోటిమందికి పైగా ఈ వీడియో చూశారు. ఇది దుబాయ్ లో జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన కొంతమంది బాగుందంటూ కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మూగజీవులను మీ సరదా కోసం ఇలా బాధపెట్టొద్దు అంటూ హితవు పలుకుతున్నారు.