LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC New Children Money Back Plan: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (LIC) సంస్థ వివిధ ఆదాయ వర్గాల ప్రజల కోసం అనేక పెట్టుబడి, బీమా పథకాలను అందిస్తోంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా భద్రతతో పాటు పొదుపు ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు LICను విశ్వసనీయమైన పెట్టుబడిగా ఎన్నుకుంటారు. ఇకపోతే.. మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ (LIC New Children Money Back Plan) మంచి ఎంపిక అవుతుంది. ఈ పథకంలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాలక్రమేణా మంచి మొత్తాన్ని అందుకోవచ్చు.
Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
Also Read
ఈ పథకంలో ఓ వ్యక్తి రోజుకు రూ.150 లేదా నెలకు దాదాపు రూ.4,500 పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని అందుకుకోవచ్చు. అది ఎలాగంటే.. రోజుకు రూ.150 పెడితే సంవత్సరానికి సుమారు రూ.55,000 పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడిని 25 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి సుమారు రూ.14 లక్షల వరకు చేరుతుంది.
ఈ పాలసీ మెచ్యూర్ సమయంలో లభించే బోనస్, ఇతర ప్రయోజనాలు కలిపి ఈ మొత్తం రూ.19 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం పిల్లల ఉన్నత విద్య లేదా వివాహం వంటి ముఖ్యమైన అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ ఓ నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ పాలసీ. ఈ పథకంలో పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందులో ప్రీమియం చెల్లించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రీమియం చెల్లించవచ్చు. దీంతో వ్యక్తులు తమ ఆదాయం, బడ్జెట్ కు అనుగుణంగా చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు.
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే.. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ కొన్ని దశల్లో మనీబ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లవాడు 18, 20, 22 సంవత్సరాలు నిండినప్పుడు సమ్ అష్యూర్డ్ లో 20 శాతం చొప్పున తిరిగి చెల్లిస్తారు. అనంతరం 25 సంవత్సరాలు నిండినప్పుడు మిగిలిన 40 శాతం మొత్తాన్ని బోనస్‌తో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.1 లక్ష. అయితే గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ మొత్తం కాలపరిమితి 25 సంవత్సరాలు ఉంటుంది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?