NTV Telugu Site icon

Delhi Secretariat sealed: ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్ట్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం..

Delhi

Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. దీంతో ఢిల్లీ సచివాలయం సీజ్ చేశారు.. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.. ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఎల్జీ ఆదేశించారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశ పెడతామన్న మోడీ గతంలో చెప్పారు. ఇప్పుడు బీజేపీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కాగా.. మరోవైపు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనీష్ సిసోడియా కూడా జంగ్‌పురా నుంచి ఓటమిని అంగీకరించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం.

READ MORE: Anna Hazare: ‘‘ఆయన దృష్టి అంతా మద్యం పైనే’’.. అన్నా హజారే సంచలన ఆరోపణ..

ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడిపోయింది. కేవలం 23 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది. దేశ రాజధానిలో బీజేపీ 27 సంవత్సరాలుగా బహిష్కరణను ఎదుర్కొంది. తాజాగా బీజేపీకి సంకెళ్లు వీడాయి. ఢిల్లీలో, ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 మరియు 2020లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతీశీ సెప్టెంబర్ 2024 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 1998, 2003, 2008లలో కాంగ్రెస్ గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు. 1993లో బీజేపీ తొలిసారి ఢిల్లీలో విజయం సాధించింది.

READ MORE: Parvesh Sahib Singh: గెలుపు క్రెడిట్ వారికే.. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ కీలక వ్యాఖ్యలు