ప్రస్తుతం ఎన్నో భీమా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.. అందులో మనీ బ్యాక్ ఆఫర్స్ ను ప్రముఖ భీమా సంస్థ ఎల్ఐసి అందిస్తుంది.. అదే ధన రేఖ పాలసీ. ఈ ధన రేఖ పాలసీని ఒకేసారి ప్రీమియం కట్టి కొనుగోలు చేసుకోవచ్చు. లేకపోతే లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాలసీ కొనుగోలు చేయొచ్చు. పాలసీ టర్మ్ 20, 30, 40 ఏళ్లుగా ఉంటుంది.. ఇందులో మీకు నచ్చిన కాలాన్ని ఎంచుకొని టర్మ్ ప్రీమియాన్ని చెల్లించాలి..
ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉంటే మీరు 40 ఏళ్ల టర్మ్‌తో రూ. 10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలని అనుకుంటే మీకు నెలకు రూ.ప్రీమియం రూ. 4950 వరకు పడుతుంది.. ఈ లెక్కన రోజుకు రూ.165 రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యాలి.. అంటే 20వ సంవత్సరంలో రూ. 2 లక్షలు.. 25వ సంవత్సరంలో రూ. 2 లక్షలు.. 30వ సంవత్సరంలో రూ. 2 లక్షలు.. 35వ సంవత్సరంలో రూ. 2 లక్షలు వస్తాయి. ఇక 40 వ సంవత్సరంలో రూ. 29 లక్షల వరకు మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. అంటే మొత్తంగా రూ. 37 లక్షలు లభిస్తాయి..
మీరు 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే 49 ఏళ్ల వరకు ప్రీమీయం చెల్లించాల్సి ఉంటుంది.. ఇక మీరు 30 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే.. అప్పుడు 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. ఇంకా 20 ఏళ్ల పాలసీ టర్మ్ ఎంచుకుంటే 10 ఏళ్లు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇంకా యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఉంటుంది. దీన్ని కూడా పొందొచ్చు. మీరు ఎంచుకునే కాలం ఆధారంగా వచ్చే లాభాన్ని పొందవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..