Jeevan Umang Policy: కస్టమర్ల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కంపెనీ ప్రవేశపెట్టిన ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పూర్తి జీవిత బీమా పథకం. ఇది పాలసీదారు, పాలసీదారుపై ఆధారపడిన వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం, ఆదాయ రక్షణను అందిస్తుంది. మెచ్యూరిటీ వరకు ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత హామీ ప్రయోజనాలలో యాన్యువల్ సర్వైవల్ బెనిఫిట్స్, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. పాలసీ మొత్తం ప్రీమియం పూర్తిగా చెల్లిస్తే పెన్షన్ తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి.
ఈ పాలసీ తీసుకునేందుకు కనీస అర్హత 90 రోజుల వయసు. గరిష్టంగా వయస్సు 55 సంవత్సరాల వారు ఈ పాలసీ తీసుకోవచ్చేు. అయితే ప్లాన్‌ను బట్టి మారవచ్చు. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన తమ బేబీ కోసం ఈ పాలసీని తీసుకోవచ్చు. వారు పెరిగిన తర్వాత మంచి రిటర్న్స్ చేతికి వస్తాయి. కనీస సమ్ అస్యూర్ రూ.2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. జీవన్ ఉమాంగ్‌లో నాలుగు ప్రీమియం టర్మ్స్ ఉన్నాయి. 15ఏళ్లు, 20ఏళ్లు, 25ఏళ్లు, 30ఏళ్లు. కనీస, గరిష్ట వయో పరిమితి ఆధారంగా పాలసీ టర్మ్ మారుతుంది. 30 ఏళ్ల కాలపరిమితికి గాను జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవాలనుకుంటే.. సదరు ఇండివిడ్యువల్ వయస్సు 40 ఏళ్లు ఉండాలి. అప్పుడు 70 ఏళ్లకు పూర్తవుతుంది. కనీసం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకోవాలి. అంటే ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 55.
Read Also: Shooting : ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు గోల్డ్ మెడల్
జీవన్ ఉమాంగ్ పాలసీ గరిష్ట వయో పరిమితిని 70. కనిష్ట వయోపరిమితి 30. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన తమ చిన్నారి కోసం ఈ పాలసీ తీసుకుంటే 30 ఏళ్లకు పూర్తవుతుంది. కంపెనీ మెచ్యూరిటీ వయస్సును 30 ఏళ్లుగా నిర్ణయించింది. జీవన్ ఉమాంగ్ ప్లాన్ ప్రకారం మెచ్యూరిటీ టైం వరకు ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత ఎల్ఐసీ ఏటా బీమా మొత్తంలో ఎనిమిది శాతం చెల్లిస్తుంది. 99 ఏళ్ల వరకు మీకు ఇలానే ప్రతి ఏడాది డబ్బులు వస్తాయి. 100 పడిన తర్వాత బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం అన్నీ కలిపి మెచ్యూరిటీ కింద లభిస్తాయి. అంటే బోనస్ రూ.17.6 లక్షలు, ఎఫ్ఏబీ రూ.17.7 లక్షలు, బీమా మొత్తం రూ.5 లక్షలు మొత్తంగా రూ.40 లక్షల వరకు వస్తాయి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఉదాహరణకు ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే సమయానికి పాలసీదారు 70 ఏళ్లు ఉంటే సదరు వ్యక్తి 100 ఏళ్లు వచ్చే వరకు వార్షిక మనుగడ ప్రయోజనాలు అందుకుంటారు. 100 ఏళ్ల లోపు మృతి చెందితే నామినీకి ఏకమొత్తంలో చెల్లిస్తారు. జీవన్ ఉమాంగ్ నాన్-లింక్డ్ ఇన్సురెన్స్ పాలసీ. గ్యారెంటీ రిటర్న్స్ హామీ ఇవ్వవచ్చు. ఒకవేళ పాలసీదారు తొలి అయిదేళ్లలో మరణిస్తే పాలసీ హామీ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఒకవేళ అయిదేళ్ల తర్వాత మరణిస్తే హమీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్ అందుతుంది.
Read Also: T20 World Cup: నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్
ఒకవేళ పాలసీదారు 25 ఏళ్ల వయసులో రూ.5 లక్షల హామీ మొత్తంతో, 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే, ఆ వ్యక్తి ప్రతేడాది రూ.14,758 ప్రీమియం చొప్పున 55 ఏళ్ల వయసు వరకు చెల్లించాలి. అక్కడి నుండి అతనికి 100 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏటా హామీ మొత్తంలో 8 శాతం అందుతుంది. అప్పటికీ జీవించి ఉంటే హామీ మొత్తం, ప్రయోజనాలు కలిపి రూ.63,08,250 అందుతాయి.