Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల సమయాల మార్పు
- ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి. ఈ టైమ్‌టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 2025 ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉండనుంది.
Read Also: Rajnath Singh: కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. కాలుష్యం కారణంగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల సమయాలను మార్చినట్లు తెలిపింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సూచనలలో.. GRAP నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాల సమయాల మార్పుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10.00 నుండి సాయంత్రం 6.30 వరకు తెరిచి ఉంటాయి.
Read Also: Amitabh Bachchan: ఇందుకే కాబోలు బిగ్‌బి అయ్యింది.. 82 ఏళ్ల వయస్సులోనూ తైక్వాండో కిక్ (వీడియో)
కార్యాలయ సమయాల్లో ఈ మార్పు 28 ఫిబ్రవరి 2025 వరకు అమలులో ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రేప్-4 కింద విధించిన ఆంక్షలను అమలు చేసేందుకు తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ-ఎన్సీఆర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. AQI (గాలి నాణ్యత సూచిక) 450 కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ రాష్ట్రాలను కోర్టు కోరింది.
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..