NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: పట్టుదలతో పని చేసి.. అధికారంలోకి వస్తాం..

Ponguleti

Ponguleti

ఖమ్మం జిల్లాలోని మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైరా నియోకవర్గస్థాయిలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నరు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయని.. ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి అందరూ తన్నుకుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు.. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కలిసి ఓకే వేదక మీదకి వస్తామన్నారు. ఐక్యంగా మేము పోరాటం చేస్తామన్నారు.

Read Also: Madhya Pradesh Love Crime: సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..

తాము ఐక్యంగా పనిచేసి జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన తీసుకొస్తాము.. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది. మోసపూరితమైన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని ప్రజలు తహతహ లడుతున్నారు.. దానికి శ్రీకారం ఖమ్మం జిల్లా నుంచే చూడతామని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇస్తే.. తెలంగాణ ప్రజలు కష్టాల నుంచి బయటకు వస్తారని ఆనాడు సోనియా గాంధీ ఆశించారు.. మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి
సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలి అని ఆయ తెలిపారు.

Read Also: MLA Sreedhar Reddy: వేలానికి ఎమ్మెల్యే ఆస్తులు..? తప్పుడు ప్రచారం.. నేను పారిపోయే వ్యక్తిని కాదు..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అదే పట్టుదలతో రాబోయే కురుక్షేత్రంలో ప్రతి ఒక్కు పనిచేయాలి అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో నాకు గాని భట్టికి, రేణుక చౌదరికి గాని భేదాభిప్రాయాలు లేవన్నారు. కాంగ్రెస్ జెండా కిందనే మనం పని చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన ఆశయం నెరవేరాలంటే అందరం కలిసి పని చేయాలి.. అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రజాప్రతినిధులను ఇంటికే పరిమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని అందరం కలిసి ఒకే స్టేజీ మీదకు వస్తాము.. గడిచిన నాలుగున్నర సంవత్సరాలో అనేక ఇబ్బందులు అనుభవించాం.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడుతుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.