Madhya Pradesh Love Crime: సోదరిని ప్రేమిస్తున్నాడని.. పార్టీ పేరుతో స్నేహితుడ్ని పిలిచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Boy Killed His Friend For Having Affair With Sister In Madhya Pradesh Kannauj: మధ్యప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుసుకున్న ఆమె అన్న.. స్నేహితుడ్ని పార్టీ పేరుతో పిలిచి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. జులై 17వ తేదీన కన్నౌజ్ పోలీసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గుర్తు తెలియనిమృతదేహం వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని, విచారణ చేపట్టారు. అప్పుడు వాళ్లకు.. ఆ మృతదేహం తూబేల్ పురాకు చెందిన అనిల్‌దిగా (25) గుర్తించారు. అతని తండ్రి విక్రమ్ మరో పోలీస్ స్టేషన్‌లో తన కొడుకు మిస్ అయినట్లు ఫిర్యాదు చేసినట్లు పోలీసులకు తెలిసింది. ఇక అప్పటి నుంచి పోలీసులు అనిల్ హత్య మిస్టరీని ఛేధించడం మొదలుపెట్టారు.
Extramarital Affair: పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ విచారణలో భాగంగా.. పోలీసులకు మొదట అనిల్ స్నేహితుడు దీపక్ కల్వార్‌పై అనుమానం వచ్చింది. అతనికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారించారు. ఫైనల్‌గా.. ఈ హత్య వెనుక ప్రధాన హస్తం దీపక్‌దే ఉండొచ్చని అనుమానం కలగడంతో.. అతనితో పాటు అతని స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు దీపక్ తానే తన స్నేహితులతో కలిసి అనిల్‌ని చంపినట్టు ఒప్పుకున్నాడు. అనిల్ కూడా తనకు స్నేహితుడేనని తెలిపాడు. అయితే.. తన సోదరితో అనిల్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న విషయం తెలిసి తాను కోపాద్రిక్తుడినయ్యానని, దాంతో అతడ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని దీపక్ పేర్కొన్నాడు. పార్టీ పేరుతో అనిల్‌ని పిలిపించి.. అతడ్ని చంపినట్లు తెలిపాడు. కాగా.. తలపై బలమైన రాడ్డుతో బాదడం వల్ల అనిల్ మృతి చెందినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.
Gadwal Love Tragedy: ప్రేమించి మోసం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందంటే?
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!