Leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లియో’.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమాకు తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా కూడా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.విజయ్ అభిమానులకు ఈ సినిమా నచ్చిన రెగ్యులర్ మూవీ లవర్స్ ని మాత్రం ఈ సినిమా నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా సినిమా ఫ్లాష్ బ్యాక్ విషయంలో చాలా మందికి అసంతృప్తి ఉంది. ఆ విషయం దర్శకుడు లోకేష్ కనగ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ఇదిలా ఉంటే ఇప్పుడు లియో ఓటిటి రిలీజ్ కు సిద్ధం అయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయి. నవంబర్ 21 నుంచి లియో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
అదేంటి అప్పుడే సినిమా ఓటిటీకి రావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు. లియో నెట్ ఫ్లిక్స్ లో రావడం నిజమే .. నవంబర్ 21 న రావడం కూడా నిజమే.. కానీ, అది విజయ్ సినిమా మాత్రం కాదు. లియో విజయ్ ది కాకపోతే మరి ఇంకెవరిది అంటే.. అదొక యానిమేటెడ్ హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ హీరో ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ సినిమాగా తెరకెక్కిన లియోను రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్‌హీమ్, రాబర్ట్ స్మిగెల్ డైరెక్ట్ చేశారు. ఒక పాఠశాలలో బల్లి, తాబేలు చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనే దానిమీద ఈ సినిమా నడుస్తోంది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా నవంబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లియో పేరు వినగానే విజయ్ సినిమా అనుకోని హడలిపోయారు అభిమానులు. మరి విజయ్ లియో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.
https://www.instagram.com/p/Czstb4nsWyf/?igshid=MzRlODBiNWFlZA==