Leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'లియో'.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలైంది. లియో సినిమాకు తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా కూడా తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.