కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ నటిస్తున్న ఈ లియో సినిమా కచ్చితంగా భారీ రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే విడుదలకు ముందే లియో రికార్డులు బద్దలు కొడుతోంది. యూకేలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. దీనితో అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.. అడ్వాన్స్ బుకింగ్ పరంగా యూకే లో మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ I సృష్టించిన రికార్డును విజయ్ లియో కూడా బద్దలు కొట్టింది.
ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ నంబర్లపై తాజా అప్‌డేట్‌ను పంచుకుంటూ ప్రముఖ సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అతని ట్వీట్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్‌లో లియో ట్రెండ్ సెట్ చేస్తాడని, ఓవర్సీస్ రికార్డులను బద్దలవుతాయని తెలుస్తోంది. 2021లో వచ్చిన మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత హీరోయిన్ త్రిష ఈ సినిమా లో విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ‘లియో’ సినిమా తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్, సంజయ్ దత్‌లతో పాటు అర్జున్ సర్జా, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.లియో సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.లియో సినిమా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.