ఈమధ్య పురాతన వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. వాటివల్ల పెద్దగా ఉపయోగం లేకున్నా వాటిని లక్షలు పోసి కొంటున్నారు.. ఇటీవల వేలంలో పురాతన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తుంది.. అయితే ఇప్పటివరకు వస్తువులను వేలం వెయ్యడం చూశాం.. కానీ వందల ఏళ్ల క్రితం నిమ్మకాయను వేలం వెయ్యడం విచిత్రంగా ఉంది కదూ.. అవును మీరు విన్నది అక్షరాలు నిజం.. పైగా దానికి రూ.1.5 లక్షలు ధర పలకడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. ఆ నిమ్మకాయ చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ నిమ్మకాయ మామూలు నిమ్మకాయ కాదు.. 19 వ శతాబ్దంలోనిది.. ఇంగ్లాండ్‌లోని ఒక కుటుంబానికి ఒక విచిత్రమైన వస్తువు కంటపడింది. అది అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న వారి మేనమామదట.. దాన్ని తీసుకున్న ఆ కుటుంబం వేలంలో పెట్టిందట.. ఆ కాయ 2 అంగుళాల వెడల్పుతో గోధుమ రంగులో ఉన్న ఆ ఎండిన నిమ్మకాయపై చెక్కిన సందేశం ప్రకారం 1739 నాటిదని తెలుస్తోంది. దానిపై ‘మిస్టర్ పి లూ ఫ్రాంచినీ నవంబర్ 3, 1739 మిస్ ఇ బాక్స్ టర్‌కి అందించారు..
ఆ నిమ్మకాయ ఎప్పుడుదో దానిపై రాసి ఉంది.. అయితే దాన్ని సరదాగా వేలంలో పెట్టారు. ఈ నిమ్మకాయ ఐదు లేదా ఆరు వేలు పలుకుతుందని అందరూ అనుకున్నారు.. కానీ అందరిని షాక్ కు గురి చేస్తూ నిమ్మకాయ £1,416 (దాదాపు రూ. 1.48 లక్షలు) భారీ ధర పలికింది. మీరు విన్నది నిజమే. బ్రెట్టెల్స్ వేలం పాటల యజమాని డేవిడ్ బ్రెట్టెల్ నిమ్మకాయను వినోదం కోసం విక్రయించాలని అనుకుంటే ఊహించని ధరకు అమ్ముడు పోయిందట. బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్టు చేసింది.. దాంతో ఈ నిమ్మకాయ వార్తల్లో హైలెట్ అవుతుంది..