యంగ్ హీరోలతో పోటీపడుతూ మాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు మోహన్ లాల్ అండ్ మమ్ముట్టి. కానీ లాలట్టన్ కన్నా మమ్మూక కాస్త వెనకబడ్డారు. కంప్లీట్ స్టార్.. ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే.. మాలీవుడ్ మెగాస్టార్ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యుయేషన్. బ్రహ్మాయుగం తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు మమ్ముట్టి. గత ఏడాది వచ్చిన డొమినిక్ ద లేడీస్ పర్స్, భజూక చిత్రాలు ఆడియన్స్‌ను బోర్ కొట్టిస్తే.. కాస్త బెటర్ అనిపించుకుంది కళంకావల్. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మళ్లీ స్పీడ్ పెంచారు మమ్మూక. నెక్ట్స్ ఫిల్మ్ లోడ్ చేసేశారు.
Also Read : King : బాద్ షా షారుక్ ఖాన్.. ‘కింగ్’ రిలీజ్ డేట్ వీడియో రిలీజ్
మమ్ముట్టి వన్స్ ఆపాన్ ఎ టైం తనకు హిట్స్ ఇచ్చిన దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్‌తో కొలాబరేట్ అయ్యారు. ఇంచుమించు 32 ఏళ్ల తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కాబోతుంది.. పాదయాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా మూవీ షూటింగ్ స్టార్టైంది. అయితే గతంలో తెలుగులో చేసిన యాత్ర, యాత్ర2కి దీనికి లింక్ ఉందా అన్నది తేలాలంటే కొంత టైం పడుతుంది. మమ్ముట్టి- అడూర్ గోపాలకృష్ణన్ కొలాబరేషన్ 1980లోనే మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వస్తే వాటిలో 1990లో చేసిన మథిలుకల్, 1994లో చేసిన విధేయన్ చిత్రాలకుగాను మమ్ముట్టికీ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ వచ్చింది. మళ్లీ అప్పటి నుండి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాలేదు. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నారు. ఇప్పటికే మోహన్ లాల్‌తో కలిసి మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ కంప్లీట్ చేసిన మమ్ముట్టి మరో రెండు సినిమాలకు ఆల్రెడీ కమిటయ్యాడు. అటు మోహన్‌లాల్ కూడా తుడరుమ్ దర్శకుడు తరుణ్ మూర్తితో మరో సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసాడు.