Lavanya Tripathi : మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన లావణ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకుంటూ మీడియాతో మాట్లాడారు. అయితే, గతంలో చిరంజీవి గారు సరదాగా చేసిన “వారసుడు కావాలి” అనే వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ఇప్పుడు తప్పుగా వాడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘అమ్మాయి (క్లింకార) పుట్టినప్పుడు ఇంత సంబరం లేదు కానీ, ఇప్పుడు అబ్బాయి పుట్టగానే ఇంత హడావిడి చేస్తున్నారా?’ అంటూ ఒక నెటిజన్ అభ్యంతరకరంగా ట్వీట్ చేశారు. దీంతొ ఈ ట్వీట్‌పై లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
‘ఇంత సంతోషకరమైన క్షణాన్ని అసహ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ట్వీట్ చూడగానే చాలా కోపం వచ్చింది. మీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంత ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో 1 శాతం కూడా చాలా మంది మగాళ్లు చేయలేరు. తెలియకుండా ఇలాంటి కామెంట్స్ చేయకండి’ అంటూ గట్టిగా బదులిచ్చారు. అయితే తాజాగా ఆమె నటిస్తున్న ‘సతి లీలావతి’ (Sathi Leelavathi) సినిమా ప్రెస్ మీట్లో మీడియా వారు ఈ విషయం గురించి అడగగా.. లావణ్య తన స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేశారు. ‘నేను నా కుటుంబానికి అండగా నిలబడ్డాను. నా ఫ్యామిలీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు సహించను’ అని కుండబద్దలు కొట్టారు. మెగా కోడలిగా ఆమె చూపిస్తున్న ఈ ధైర్యం కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమని చూసి మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?