Lavanya -Rajtarun : రాజ్‌తరుణ్‌ని వదిలే ప్రసక్తి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంట గంటకో మలుపు తిరుగుతోంది రాజ్‌తరుణ్ – లావణ్యల వ్యవహారం. తనను రాజ్‌తరుణ్ మోసం చేసాడని, అన్నిరకాలుగా వాడుకొని వదిలేసాడని, తన దగ్గర డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడు. మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉంది. నన్ను అడ్డు తప్పించేందుకు డ్రగ్స్ కేసు తనపై పెట్టించాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టింది లావణ్య అనే యువతి.
ఈ వివాదం రేగిన కాసేపటికే హీరో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి లావణ్య వ్యాఖ్యలను ఖండించాడు. లావణ్య డ్రగ్స్ కు బానిసై ఇదంతా చేస్తుందని తనకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదన్నాడు. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని లావణ్యతో న్యాయనిపుణుల సమక్షంలోనే మాట్లాడతానని తెలిపాడు. ఆమె బెదిరింపులకు భయపడను ఆమె బ్లక్ మెయిల్ వ్యవహారాలను ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించి కేసు పెడతానని అన్నాడు రాజ్ తరుణ్.
Also Read
కాగా రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై మరోసారి లావణ్య స్పందించింది. ఈ సారి కాస్త డోస్ పెంచి మరింత సంచనల ఆరోపణలు చేసింది. లావణ్య మాట్లాడుతూ రాజ్‌తరుణ్ చేతిలో చాల మంది హీరోయిన్లు బలయ్యారు, అతనొక ఉమనైజర్, అతని చిత్రాల్లో కథానాయికలుగా నటించిన ప్రతీ అమ్మాయిని సెక్సువల్ వేధిస్తాడు. తన కోరిక తీర్చమని బలవతం చేస్తాడు. రాజ్‌తరుణ్‌తో అనుభవించు రాజ చిత్రంలో నటించిన అరియాన గ్లోరితో అతనికి సంబంధం ఉంది, అలాగే పవర్ ప్లే చిత్ర నాయికి హేమల్ ఇంగిల్, లవర్ సినిమాలోని హీరోయిన్ రిద్ది కుమార్ తోను రాజ్‌తరుణ్‌కు ఇల్లీగల్ సంబంధాలు ఉన్నటు లావణ్య తెలిపింది.
వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వీటన్నిటితో రేపు మీడియా సమావేశం నిర్వహించి ఆధారాలను మీడియాకు అందజేస్తానని లావణ్య వెల్లడించింది. ఒకరిపైఒకరు సంచలన ఆరోపణలతో సాగుతోంది ఈ వ్యవహారం. రేపు లావణ్య నిర్వహించబోయే మీడియా సమావేశంలో ఎటువంటి ఆధారాలు బయటపెడుతోందో, ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. లావణ్య వ్యాఖ్యలకు రాజ్‌తరుణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..