Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్‌లు, నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్‌తో ఉన్న ఈ మోడల్ ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ నలుపు, తెలుపు రెండు ఆకర్షణీయమైన రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది . ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్‌తో ఈ ఫోన్ ముందుగా OnePlus 11, Huawei P60 Pro వంటి ఫోన్‌లలో చూడబడిన మార్బుల్ డిజైన్‌ను తీసుకువచ్చింది. లావా రిటైల్ అవుట్‌లెట్‌లు, ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Presenting LAVA Yuva 2 5G: Ab Dunia ko Dikha! 🤩
Shop now at your nearest retail outlets!
Price: ₹9,499/-✅ Stunning Notification Light
✅ 700Nits High Brightness Mode
✅ 50MP AI Dual Rear Camera
✅ 4GB+4GB* RAM I 128GB UFS 2.2 ROM
✅ Dual Stereo Speakers
✅ Octa-core… pic.twitter.com/ZEEj5TCvZj— Lava Mobiles (@LavaMobile) December 27, 2024
Read Also: Mobile Charging Tips: మొబైల్ బ్యాటరీ బాగుండాలంటే.. రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా?
ఇక Lava Yuva 2 5G ఫీచర్ల విషయానికి వస్తే.. 6.67-అంగుళాల డిస్‌ప్లే, HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్, సెంట్రల్ పంచ్‌హోల్ కటౌట్ లను కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ లో మొత్తం 8GB RAM (4GB హార్డ్‌వేర్ RAM + 4GB వర్చువల్ RAM), Unisoc T760 చిప్‌సెట్ ప్రాసెసర్ తో 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP AI లెన్స్, ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
Read Also: Bhatti Vikramarka: మన్మోహన్ సింగ్ మృతి దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. Lava Yuva 2 5G వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అతి తక్కువ ధరలో అధిక ఫీచర్లు అందిస్తుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్‌ల విభాగంలో అత్యుత్తమంగా నిలుస్తోంది. కాల్‌లు, నోటిఫికేషన్‌ల కోసం ప్రత్యేక బ్యాక్‌లైట్ డిజైన్ ఫీచర్ ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణను తీసుకువచ్చింది.