ప్రజలకు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. సామాన్యుడి నుంచి పెద్ద ప్రొఫెషనల్స్ వరకు.. అందరూ ఇలాంటి మోసాల బారిన పడిన వారే.. ఎందుకంటే ప్రజలను బురిడీ కొట్టించేందుకు స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏదో పెద్ద కొరియర్ కంపెనీ నుంచి పార్సిల్ వచ్చిందని, దాంట్లో డ్రగ్స్ లాంటివి ఉన్నాయని భయపెడుతూ స్కామర్లు ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నారు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తాజాగా తన కొలీగ్ ఇలాంటి మోసానికి గురయ్యాడని చెప్పాడు.
Read Also : Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
ఇటీవలి కాలంలో కొరియర్, పార్సిల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి.. ఫెడెక్స్, బ్లూ డార్ట్, ఇతర కొరియర్ కంపెనీల నుంచి కొరియర్ వచ్చిందని చెబుతూ, స్కామర్లు ఫోన్లు చేస్తున్నారు. పెద్ద నగరాల్లో జరుగుతున్న ఇలాంటి మోసాల గురించి నితిన్ ప్రజలను హెచ్చరిస్తూ ఒక ట్వీట్ చేశారు. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చెప్పుకొచ్చారు.
Read Also : Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్
ఇలాంటి విషయాల్లో స్కామర్లు ముందు బాధితులను భయపెట్టి.. వారి భయాన్ని సాధ్యమైనంత త్వరగా క్యాష్ చేసుకోవాలనుకుంటారు. నితిన్ కామత్ కొలీగ్ విషయంలో కూడా ఇదే జరిగింది అని అతడు చెప్పాడు. సైబర్ సెక్యూరిటీ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి.. అయినా అతడిని స్కామర్లు భయపెట్టి, ప్రాక్టికల్‌గా ఆలోచించేంత సమయం ఇవ్వకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు అని కామత్ తెలిపాడు.
Read Also : Night Mares: మీకు పీడకలలు వస్తున్నాయా..? కారణం ఇది..!
మీకు కూడా ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే.. ముందు భయపడకుండా కూల్‌గా ఉండాలని నితిన్ కామత్ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి.. నా లాయర్‌తో మాట్లాడి, ఆయన్ను మీతో మాట్లాడిస్తాను అని కాల్ చేసిన వారికి చెప్పాలని నితిన్ సలహా ఇచ్చాడు. మీకు లాయర్ లేకపోయినా పర్వాలేదు. చాలా మంది మోసగాళ్లు భయపడే వారిని, వెంటనే రెస్పాండ్ అయ్యే వారిని టార్గెట్‌గా చేసుకుంటారు. అందుకే మీరు భయపడకుండా వెంటనే రెస్పాండ్ అవ్వకుండా, కాస్త ఆలోచించాలి అని నితిన్ కామత్ వెల్లడించాలి.