హాయిగా, ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవాలి. కానీ చాలా మందికి రాత్రిళ్లు పీడకలలు వస్తుంటాయి. ఈ పీడకలల వల్ల భయంతో రాత్రిళ్లు నిద్ర పోలేకపోతారు. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే ఏం కాదు కానీ.. రోజూ ఇలాగే అయితే మాత్రం ఆరోగ్యం బాగా దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది.
Read Also : Rs. 2000 note withdrawal: బ్యాంకులకు చేరిన 72 శాతం రూ.2000 నోట్లు..
పీడకలలు రావటానికి ఒత్తిడి, యాంగ్జైటీ సాధారణ కారణాలలో ఒకటి. మనస్సు ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలతో నిండినప్పుడు నిద్ర ప్రభావితం అవుతుంది. అలాగే భయంకరమైన కలలు పడుతాయి. అంతేకాదు మన శరీరం ఒత్తిడిని కలిగించే కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో పీడకలలు వచ్చే చేస్తుంది.
Read Also : Hyderabad : మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు.. పలువురికి తీవ్ర గాయాలు..
గాయం లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తులకు ఈ పీడకలలు తరచుగా పడుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి గత జ్ఞాపకాలను ప్రేరేపించే స్పష్టమైన, భయంకరమైన కలలు వస్తాయి. యాంటీ డిప్రెసెంట్స్, బీటా-బ్లాకర్స్, రక్తపోటు మందులు వంటి కొన్ని మందులు భయంకరమైన కలలు, పీడకలలకు కారణమవుతాయి. ఈ మందులు నిద్ర, కలలను నియంత్రించే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేస్తాయి.
Read Also : Astrology: జూన్ 25, ఆదివారం దినఫలాలు
స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి నిద్ర రుగ్మతలు నిద్ర నాణ్యతను తగ్గిస్తాయి. అలాగే పీడకలలకు కారణమవుతాయి. స్లీప్ అప్నియా ఉన్నవారు నిద్రపోతున్నప్పుడు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఇది కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. తర్వాత పీడకలలకు కారణమవుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కలలను నియంత్రించే మెదడు సామర్థ్యం ప్రభావితం అవుతుంది. దీని వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also : Rain Effect: తెలంగాణకు రెయిన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు కూడా పీడకలలకు కారణమవుతాయి. ఉదాహరణకు పడుకునే ముందు హెవీగా తినడం వల్ల అజీర్ణం సమస్య వస్తుంది.. దీని వల్ల ఇది కలలకు దారితీస్తుంది. మూర్ఛ, పార్కిన్సన్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి వంటి అనారోగ్య సమస్యలు కూడా పీడకలలకు కారణమవుతాయి. ఈ సమస్యలు నిద్ర, కలలను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.