Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. కుటుంబం అంతా కలిసి కూర్చుని తీసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. సినిమాలో ఎంత రక్తం పారితే.. ఎన్ని కార్లు గాల్లోకి ఎగిరితే.. బెడ్ సీన్స్.. లిప్ లాకులు ఎన్ని ఎక్కువుంటే ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయి. అందుకే చాలా మంది డైరెక్టర్లు హీరోలకు అలాంటి కథలనే వినిపిస్తూ.. వాటిని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలోని హీరోలు రొమాంటిక్ సీన్స్ లో నటించినా విజయ్ దేవరకొండ చేస్తే వచ్చే కిక్ మరే హీరోకు రాదు.
ఆయన హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ చాలా నేచురల్ గా.. రియలిస్టిక్ గా ఉంటుంది. అయితే తెరపై విజయ్ దేవరకొండ హీరోయిన్స్ తో రొమాన్స్ అంత బాగా పండడానికి కారణం లేకపోలేదు. ఇదంతా ఆయన ఫ్రెండ్లీ నేచర్ అని తెలుస్తోంది. అలాంటి సీన్స్ చేసేటప్పుడు విజయ్ దేవరకొండ హీరోయిన్స్ కి ఫుల్ కంఫర్టబులిటీ కలిపిస్తాడట. సీన్ ఎప్పుడైతే చేయాలని డైరెక్టర్ నిర్ణయించుకుంటాడో ఆ సమయంలో ఆయన హీరోయిన్స్ తో మామూలు కంటే ఎక్కువ సమయం మాట్లాడుతారట. ఇది కేవలం సినిమా కోసం చేసేది.. ఫ్రెండ్లీగా పూర్తిగా హీరోయిన్స్ ని తమ కంట్రోల్లోకి తీసుకుని వాళ్లకు చాలా కంఫర్టబుల్గా ఇబ్బంది కలగకుండా ఆ సీన్స్ లో నటిస్తారట. అందుకే తెరపై విజయ్ దేవరకొండ ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన చాలా బాగా పండుతుందట. ఆ హీరోయిన్ నిజంగా తన కోసమే పుట్టిందేమో అన్నంతల జనాలు ఫీల్ అయిపోయేలా చేస్తుంటాయి ఆ సీన్స్. దీంతో ఆ సీన్స్ చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతుంటారు.