NTV Telugu Site icon

Munugode By Poll : నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..

Munugode Nominations

Munugode Nominations

తెలంగాణలో మునుగోడు ముచ్చట జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు మేనియా నడుస్తోంది. రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం మునుగోడుపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీకీ, తిరిగి తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న టీఆర్‌ఎస్‌కు ఈ మునుగోడు ఉప ఎన్నిక కీలకమని చెప్పొ్చ్చు. అయితే.. ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నేటి సాయంత్రంతో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 17ను చివరితేదీగా నిర్ణయించారు. అయితే.. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుండగా.. నవంబర్‌ 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది.

Also Read : హెబ్బా.. ఏంటబ్బా.. ఈ అందాల ఆరబోత..

ఇదిలా ఉంటే… బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే.. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు సైతం నామినేషన్లు వేశారు. అయితే.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.