అరుణాచల్ ప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జిల్లాల్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా శనివారం సిజి వద్ద అకాజన్-లికాబాలి-ఆలో రహదారిపై కొండచరియలు విరిగిపడినట్లు ఓ అధికారి తెలిపారు. అయితే తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో భారీ వాహనాలను అనుమతించడం లేదని, దీంతో గత కొన్ని రోజులుగా రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. చిన్న వాహనాలకు మాత్రమే అనమతి ఉందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: AP Panchayat Bypoll Results: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా..
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లోని లేపా రాడా, పశ్చిమ సియాంగ్, ఎగువ సియాంగ్, సియాంగ్, ఎగువ సుబంసిరి మరియు షి యోమి జిల్లాలలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు.. ఈ రహదారులను మూడు రోజులు పాటు మూసివేయాలని తెలిపారు. అనంతరం రోడ్లపై మరమ్మత్తు పనులూ పూర్తి చేస్తామన్నారు.
Read Also: Rashmi Gautam: బాయ్ ఫ్రెండ్ గురించి రష్మీ హాట్ కామెంట్స్.. గ్యాప్ వచ్చేస్తుందట!
ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్లో ఆగస్టు 29 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.