Lakshmi Devi indication before coming home: హిందూ పురాణాల ప్రకారం.. లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తారు. లక్ష్మీదేవి ఎవరిపై దయ చూపుతుందో.. వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకుంటే.. ఆ వ్యక్తి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అదృష్టం లేకపోవడం వల్ల కొందరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు.
శాస్త్రాల ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంను పొందుతాడు. లక్ష్మీదేవికి సంబందించిన కొన్ని సంకేతాలు కూడా జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు డబ్బు రాక మొదలవుతుంది. అయితే లక్ష్మీదేవి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. దాంతో త్వరలో డబ్బుల వర్షం కురుస్తుందని అర్థం చేసుకోవాలి.
శంఖం శబ్ధం:
హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో శంఖాన్ని ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన తర్వాత శంఖం శబ్ధం వింటే అది శుభ సూచకం. ఇది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు.
గుడ్లగూబను చూడటం:
గ్రంధాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు. అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తోంది. ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే.. లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం.
Also Read: Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!
ఊడ్చడం:
శాస్త్రాలలో చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటే.. లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఉంటాయి. ఎవరైనా ఉదయం ఊడ్చడం చూస్తే.. అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
పాము రాక:
జ్యోతిషశాస్త్రంలో పామును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. కలలో పాము లేదా బల్లి కనిపిస్తే.. మీఇంట్లోకి డబ్బు రాక వస్తుందని అర్ధం.
ఆహారంలో మార్పులు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆగమనం ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడితే.. ఆ ఇంటి ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి. అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉంటారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు)