ఢిల్లీ మెట్రో రోజు రోజుకు ఫెమస్ అవుతున్న విషయం తెలిసిందే.. మెట్రోలో రీల్స్ చేస్తూ యువత క్రేజ్ ను పెంచుకున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. మెట్రోలో లేడీస్ కోచ్ లో ఓ అబ్బాయి ఎక్కడంతో అక్కడున్న మహిళలు అతనితో వాగ్వాదానికి దిగారు.. దీంతో ఆ మెట్రో మొత్తం రణరంగంగా మారింది.. లేడీస్ కోచ్‌లోకి ఓ వ్యక్తి ఎక్కడంతో ఇద్దరు మహిళలు అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగారు.. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు మరో గొడవ నెట్టింట హల్ చల్ చేస్తుంది..
అయితే, ఈ సారి మెట్రో కాదు.. DTC కి చెందిన ఓ బస్సులో మహిళల కు సంబందించిన ఫైట్ ఇది.. ఇద్దరు మహిళా ప్రయాణీకుల మధ్య జరిగిన సిగపట్లకు సంబంధించిన వీడియో ఇది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వేల సంఖ్యలో నెటిజన్ల లైకులు, కామెంట్లను సంపాధించింది.. సీటు కోసం కుస్తీ పడుతున్న కొందరు మహిళల ఫైట్ ఇది.. ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
ఈ వీడియోలోని గొడవ ఎప్పుడు జరిగింది అనే విషయం మాత్రం తెలియదు గానీ, తేదీ లేని వీడియో ఓ ట్విట్టర్ యుజర్ షేర్ చేశారు.. సీటు కోసం ఢిల్లీ ప్రభుత్వ బస్సులో మహిళల సిగపట్లు అనే శీర్షికతో షేర్ చేయబడింది. ఒక ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియో క్లిప్ సోషల్ మీడియా యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.. ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో ను చూసిన చాలా మంది వినియోగదారులు ఇలాంటి చర్యలు ఏ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జరగకూడదని పేర్కొన్నారు.. ఇలాంటి గొడవలు ఆడవాళ్లకు మాత్రమే చెల్లుతాయని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
Kalesh b/w Two Woman inside Delhi Government Bus over Seat issues pic.twitter.com/M1CWkaU5Xx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2023