LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LA 2028 Olympics: ఒలింపిక్స్ వేదికపై భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరును చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఈ దాయాదుల పోరు సాధ్యం కాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, చివరిసారిగా 1900లో కనిపించిన క్రికెట్‌ను మళ్లీ ఒలింపిక్స్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. సరికొత్తగా, మరింత ఉత్కంఠభరితంగా 15 మంది సభ్యులతో కూడిన జట్లు టీ20 ఫార్మాట్లో ఇక్కడ తలపడనున్నాయి. అయితే, పొమోనాలో ప్రత్యేకంగా నిర్మించనున్న స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీలో చోటు దక్కించుకోవడం మాత్రం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే పురుషుల, మహిళల విభాగాల్లో కేవలం ఆరు అత్యుత్తమ జట్లకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం ఆరు స్థానాల్లో ఐదింటిని ర్యాంకింగ్స్, ప్రధాన టోర్నమెంట్ల ఆధారంగా భర్తీ చేస్తుండగా, చివరి ఆరో స్థానం కోసం 2027లో ఒక హై-స్టేక్స్ వైల్డ్‌కార్డ్ ‘ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్’ టోర్నీని నిర్వహించనున్నారు.
పురుషుల జట్ల విషయానికొస్తే, ఈ ఒలింపిక్ అర్హత ప్రక్రియ అంతా ఐసీసీ అధికారిక టీ20 ర్యాంకింగ్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే రాబోయే ఆరు నెలల్లో జరిగే ప్రతి ద్వైపాక్షిక సిరీస్, టోర్నమెంట్ ప్రతి జట్టుకూ అత్యంత కీలకంగా మారనుంది. ఐదు ఆటోమేటిక్ బెర్త్‌లను ఖరారు చేయడానికి ఐసీసీ 31 డిసెంబర్ 2026ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఆతిథ్య దేశంగా అమెరికా (USA) పురుషుల జట్టుకు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉన్నప్పటికీ, ఐసీసీ ఒక కఠినమైన నిబంధన పెట్టింది. 30 జూన్ 2026 నుంచి 31 డిసెంబర్ 2026 మధ్య కాలంలో అమెరికా జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏదో ఒక సమయంలో టాప్-15లోకి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా 13వ స్థానంలో ఉన్నందున, విండో ప్రారంభమైన మొదటి రోజే వారు ఈ అర్హతను సాధించినట్లవుతుంది. ఆ తర్వాత ఒకవేళ వారి ఫామ్ దెబ్బతిని ర్యాంకింగ్స్‌లో కిందకు పడిపోయినా, ఒలింపిక్ టికెట్ మాత్రం వారికే సొంతమవుతుంది. ఇక గ్లోబల్ ప్రాతినిధ్యం కోసం ఐఓసీ (IOC) ఒక కీలక నిబంధన విధించింది. దీని ప్రకారం ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి 31 డిసెంబర్ 2026 నాటికి అత్యుత్తమ ర్యాంకుల్లో ఉన్న ఒక్కో జట్టుకు మాత్రమే నేరుగా (ఆటోమేటిక్ బెర్త్) అవకాశం దక్కుతుంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ సమీకరణాల ప్రకారం.. ఆసియా నుంచి భారత్ (ర్యాంక్ 1), యూరప్ నుంచి ఇంగ్లాండ్ (ర్యాంక్ 2), ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా (ర్యాంక్ 3), ఆఫ్రికా నుంచి సౌతాఫ్రికా (ర్యాంక్ 5) సులువుగా అర్హత సాధించే రేసులో ముందంజలో ఉన్నాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఆసియా ఖండం నుంచి నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్ నేరుగా క్వాలిఫై అయిపోతుండటంతో, అదే ఖండానికి చెందిన పాకిస్తాన్ (ర్యాంక్ 6) రేసులో వెనుకబడిపోయింది.
Also Read
దీంతో చివరిదైన ఆరో స్థానం కోసం ఎనిమిది జట్లతో జరిగే ‘ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్ 2027’ టోర్నీ ద్వారానే పాకిస్తాన్ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఖండాల వారీగా నేరుగా అర్హత సాధించలేకపోయిన తదుపరి టాప్-7 గ్లోబల్ జట్లు ఇందులో తలపడతాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే, పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్ (ర్యాంక్ 4) లాంటి బలమైన జట్లు కూడా ఈ చావో రేవో తేల్చుకునే వైల్డ్‌కార్డ్ టోర్నీలో ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఈ క్వాలిఫైయర్ టోర్నీలో పాకిస్తాన్ గెలిచి వస్తేనే ఒలింపిక్స్‌లో భారత్-పాక్ మ్యాచ్ సాధ్యమవుతుంది, లేదంటే ఈ మెగా సమరానికి పాక్ దూరం కాక తప్పదు. ఈ మొత్తం ప్రక్రియలో వెస్టిండీస్ జట్టుకు మరో విచిత్రమైన సమస్య ఎదురైంది. వెస్టిండీస్ అనేది కరేబియన్ దీవుల దేశాల కలయికతో ఏర్పడిన ఒక క్రికెట్ బోర్డు మాత్రమే కానీ, అది ఒకే జాతీయ ఒలింపిక్ కమిటీ (NOC) పరిధిలోకి రాదు. అందుకే ఒలింపిక్స్‌లో వారు వెస్టిండీస్ పేరుతో ఆడలేరు. దీని కోసం ఐసీసీ ఒక ప్రత్యేక మార్గాన్ని వెతికింది. 31 డిసెంబర్ 2026 నాటికి అర్హత సాధించని జట్లలో వెస్టిండీస్ గనుక టాప్-8 లో ఉంటే, కరేబియన్ దీవుల దేశాల మధ్య ఒక ప్రత్యేక క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు. అందులో గెలిచిన ఒక నిర్దిష్ట ద్వీప దేశం మాత్రమే 2027 నాటి గ్లోబల్ ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తుంది.
మరోవైపు, పురుషుల రేసు ఇంకా సస్పెన్స్‌గా సాగుతుంటే, మహిళల విభాగంలో అప్పుడే ఒలింపిక్ చిత్రం సగం స్పష్టమైపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ద్వారా ఇప్పటికే నాలుగు ప్రధాన స్లాట్లు భర్తీ అయ్యాయి. ఖండాల వారీగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా (ఓషియానియా), గ్రేట్ బ్రిటన్-ఇంగ్లాండ్ ప్రాతినిధ్యంలో (యూరప్), భారత్ (ఆసియా), సౌతాఫ్రికా (ఆఫ్రికా) జట్లు అధికారికంగా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ టికెట్లను ఖరారు చేసుకున్నాయి. ఇక ఐదో స్థానం కోసం పురుషుల జట్టు లాగే అమెరికా మహిళల జట్టు కూడా టాప్-15 ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, 1 మార్చి 2027 నాటికి ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్న ఇతర దేశానికి ఆ అవకాశం ఇస్తారు. ఆరో స్థానాన్ని 2027లో జరిగే ఎనిమిది జట్ల గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ ద్వారా నిర్ణయిస్తారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ 6 జట్ల మధ్య టోర్నమెంట్ ఫార్మాట్ కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. ఈ ఆరు జట్లను తలా మూడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. మొదట సింగిల్ రౌండ్-రాబిన్ పద్ధతిలో గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత, ఒక గ్రూప్‌లోని జట్టు, రెండో గ్రూప్‌లో భిన్నమైన స్థానాల్లో నిలిచిన జట్లతో మరో రెండు క్రాస్-పూల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మల్టీ-ఫేజ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మొత్తం పాయింట్ల పట్టికలో టాప్-2 లో నిలిచిన జట్లు నేరుగా స్వర్ణ పతకం (గోల్డ్ మెడల్) కోసం తలపడతాయి. అలాగే మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్య పతకం (బ్రాంజ్ మెడల్) కోసం పోటీ పడతాయి. ఏదేమైనా, క్రికెట్ అభిమానులకు సరికొత్త మజా పంచేందుకు లాస్ ఏంజిల్స్ 2028 వేదిక అయితే సిద్ధమవుతోంది, కానీ భారత్-పాక్ పోరు జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న!
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!