NTV Telugu Site icon

KVP Ramachandra Rao: పురంధేశ్వరిపై జాలి పడుతున్నా.. బీజేపీ చేసిన పనులకు సమాధానం చెప్పాలి

Kvp

Kvp

KVP Ramachandra Rao: భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులైన విషయం విదితమే.. ఆమెకు బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా శుభాకాంక్షలు చెబుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేవీపీ రామచంద్రరావు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పురంధేశ్వరి పట్ల జాలి పడుతున్నానన్న ఆయన.. బీజేపీ చేసిన పనులకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అసలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీయే అని మండిపడ్డారు కేవీపీ.. బీజేపీకి ఉన్న 0.48 ఓటు శాతం ఇంకా తగ్గిపోతోందని జోస్యం చెప్పారు. మరోవైపు.. చంద్రబాబుకు ఒక నిబద్ధత లేదని విమర్శించారు కేవీపీ.. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఘటనా ఘటన సమర్ధుడు అని విమర్శించారు.. రాహుల్ గాంధీతో స్టేజీ పంచుకుని, 2018లో కలిసి పోటీ చేశారు.. కానీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే చంద్రబాబు నోరు మెదపలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ.. 2024లో ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారకపోవచ్చు.. కానీ, సంస్ధాగతంగా బలపడతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Dharmapuri Arvind: కిషన్ రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్.. 2024లో మోడీ మూడోసారి పీఎం అవుతారు

మరోవైపు.. రోశయ్య, వంగవీటి రంగాతో నాకు వ్యక్తిగత పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు కేవీపీ.. రంగా 1981లో కార్పొరేటర్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు.. రంగా అంటే వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి అవ్యజనీయమైన ప్రేమ ఉండేది.. వంగవీటి మోహన రంగా సేవా భావాన్ని, విశ్వసనీయతని రాజశేఖర్ రెడ్డి గుర్తించారు.. రాజశేఖర్ రెడ్డి నమ్మి అప్పజెప్పిన బాధ్యతలను రంగా నెరవేర్చారు.. కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఏర్పడటానికి రంగా కృషి చేశారు.. ఎందరో యువకులు రంగా స్ఫూర్తితో రాజకీయాలలోకి వచ్చారని.. రంగా 1985లో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. కానీ, అసాంఘిక శక్తుల చేతుల్లో రంగా అమరుడయ్యాడు.. రంగా బలిదానం కాంగ్రెస్ గెలుపులో ఎంతోకొంత పాత్ర వహించిందన్నారు.. రంగా మరణంతో చాలాకాలం టీడీపీ తెర మరుగైపోయిందని పేర్కొన్నారు కేవీపీ రామచంద్రరావు.

Show comments