NTV Telugu Site icon

Kuwait fire: అక్రమాస్తులపై ఉక్కుపాదం.. కఠిన చర్యలకు ప్రభుత్వం నిర్ణయం

Fieie

Fieie

కువైట్ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్ది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పొగ పీల్చి అక్కడిJక్కడే మెట్లపై ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. ఓ కంపెనీకి చెందిన కార్మికులను అద్దె భవనంలో బస కోసం తీసుకున్నారు. ఊహించని రీతిలో ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందారు. అయితే ప్రమాదానికి గురైన భవనం సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి ప్రభుత్వ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అక్రమ కట్టడాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Vande Bharat: త్వరలో వందేభారత్‌ స్లీపర్‌.. ట్రయల్‌ రన్‌ ఎప్పుడంటే..!

ఇదిలా ఉంటే అగ్నిప్రమాదంలో జరిగిన మృతదేహాలను ప్రధాని మోడీ చొరవతో రెండ్రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 45 మంది డెడ్‌బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Cancer: క్యాన్సర్ సోకే ముందు మీలో కనిపించే లక్షణాలు ఇవే..