Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి సినిమాపై విజయ్‌తో పాటు ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఖుషి సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుటోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఖుషి ట్రైలర్‌ను ఆగస్టు 9న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ సెన్సార్ పూర్తయినట్లు హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఖుషి ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకండ్స్ ఉందని రౌడీ హీరో పేర్కొన్నాడు.
ఖుషి సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. సినిమా ప్రీమియర్స్‌ను ఆగస్టు 31న ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఖుషి సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ‘నా రోజా నువ్వే..’, ‘ఆరాధ్య..’ సాంగ్స్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళుతున్నాయి. మరి ట్రైలర్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read: Samantha Myositis Treatment: మయోసైటిస్ చికిత్స కోసం స్టార్ హీరో నుంచి 25 కోట్లు.. సమంత ఏమన్నారంటే?
Locked and Censored.
2.41 mins of #KushiTrailer ❤️#Kushi pic.twitter.com/DpqAF0zqqj— Vijay Deverakonda (@TheDeverakonda) August 4, 2023